మీ జుట్టు( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.? హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టి మళ్లీ జుట్టును ఒత్తుగా మార్చుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే కలబంద సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ సీరం ను వాడారంటే మీ జుట్టు డబుల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem ) సైతం దూరం అవుతుంది.
మరింతకీ కలబందతో సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera )ను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ కలబంద జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన సీరం సిద్ధపడుతుంది.
ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ తో శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ కలబంద సీరంను వాడడం వల్ల క్రమంగా జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్( Hair Growth ) అవుతుంది.
ఫలితంగా కొద్ది రోజుల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.పైగా ఈ సీరంను వాడడం వల్ల చుండ్రు సమస్య ( Dandruff )ఉంటే పరార్ అవుతుంది.
హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.మరియు కురులు ఆరోగ్యంగా సైతం మారతాయి.