ఎస్వీ రంగారావు.తెలుగు సినిమా పరిశ్రమకు దొరికి ఆణిముత్యం.
తన చక్కటి నటనతో అగ్రహీరోలను సైతం వారెవ్వా అనిపించేలా చేసిన మహా నటుడు.అంతటి గొప్ప నటుడికి ఓ పెద్ద వ్యసనం ఉండేది.
అదే తాగుడు.మద్య లేకుండా ఉండేవాడు కాదు.
రోజుల తరబడి తాగుతూనే ఉండేవాడు.అయితే ఎస్వీఆర్ తాగుడు వ్యసనం మూలంగా సూపర్ స్టార్ కృష్ణ చాలా ఇబ్బందులు పడ్డాడు.
ఇంతకీ ఆయన బాధకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.కృష్ణ కొత్త కాపురం అనే సినిమా చేయాలి అనుకున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర అత్యంత కీలకమైనది.అందుకే ఈ పాత్రకు ఎస్వీఆర్ ను ఓకే చేయాలని దర్శకనిర్మాతలకు చెప్పాడు.
కానీ అప్పటికే ఎస్వీఆర్ మద్యానికి బాగా బానిస అయ్యాడు.కానీ కృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనే కావాలని పట్టుబట్టాడు.
తన తర్వాతి సినిమాలో కీలక పాత్ర ఇవ్వడంతో పాటు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఇప్పిస్తానని ఎస్వీఆర్ కు మాట ఇచ్చాడు కృష్ణ.అనుకున్నట్లుగానే కొత్త కాపురం సినిమాలో ఆయనకు ఈ పాత్ర వచ్చేలా చేశాడు.
అదే సమయంలో ఎస్వీఆర్ తన ఫార్మ్ హౌస్ లోకి వెళ్లి రోజుల తరబడి మందు తాగేవాడు.ఆ సమయంలో ఎవరినీ కలిసేవాడు కాదు.
అతడిని ఎవరైనా కలవాలని ప్రయత్నించినా.డ్రైవర్.
ఎస్వీఆర్ పరిస్థితి వివరించేవాడు.సార్ ఇంకా సమాధిలోనే ఉన్నాడు అని చెప్పేవాడు.
పలుమార్లు సినిమా షూటింగ్ కొనసాగుతున్న సమయంలో.తోటకు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.కానీ ఆయన కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారు తప్ప.పల్లెత్తు మాట అనేవారు కాదు.కొత్తకాపురం సినిమా విషయంలో చాలా మంది భయపడ్డారు.కారణం ఎస్వీఆర్ అప్పటి పరిస్థితి.
అన్ని సీన్లు అయిపోయాయి.కేవలం తన సీన్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.
ఎన్నిసార్లు తోటకు వెళ్లినా.డ్రైవర్ నుంచి పాత సమాధానమే వచ్చేది.
ఒకరోజు నిర్మాత వెంకటరత్నం ఎస్వీఆర్ దగ్గరకు వెళ్లి బతిమాలాడు.దీంతో ఆయన సరే అని చెప్పి.
షూటింగ్ కు సహకరించాడు.అంతా సజావుగా జరుగుతుంది అనుకున్న సమయంలోనే ఆ మహా నటుడు చనిపోయాడు.
ఏం చేయాలో అర్థంకాక.కొత్తకాపురం సినిమా యూనిట్ తన ప్లేస్ లో గుమ్మడిని పెట్టుకుని సినిమా కంప్లీట్ చేసింది.