ఈ మూడు సినిమాలపైనే అత్యంత భారీ స్థాయిలో అంచనాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్న ఆ సినిమాలలో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.అయితే మూడు సినిమాలపై మాత్రం అంచనాలు మామూలుగా లేవు.

 High Expectations On These Movies Peddi Dragon Spirit Details, Prabhas, Spirit M-TeluguStop.com

మూడు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మూడు సినిమాల జాబితాలో పెద్ది,( Peddi ) డ్రాగన్,( Dragon ) స్పిరిట్( Spirit ) ఉన్నాయి.

రామ్ చరణ్( Ram Charan ) బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.బుచ్చిబాబు ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Telugu Buchi Babu, Dragon, Jr Ntr, Ntrprabhas, Peddi, Peddispirit, Prabhas, Pras

సుకుమార్ సైతం డైరెక్టర్ బుచ్చిబాబుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఎన్టీఆర్,( NTR ) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా డ్రాగన్ సినిమాలో ట్విస్టులు కొత్తగా ఉండనున్నాయని భోగట్టా.

ఎన్టీఆర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Buchi Babu, Dragon, Jr Ntr, Ntrprabhas, Peddi, Peddispirit, Prabhas, Pras

ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్రభాస్( Prabhas ) సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

త్వరలో ఈ సినిమా షూట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.ప్రభాస్ ఈ సినిమాతో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube