ఈ మూడు సినిమాలపైనే అత్యంత భారీ స్థాయిలో అంచనాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్న ఆ సినిమాలలో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.
అయితే మూడు సినిమాలపై మాత్రం అంచనాలు మామూలుగా లేవు.ఈ మూడు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ మూడు సినిమాల జాబితాలో పెద్ది,( Peddi ) డ్రాగన్,( Dragon ) స్పిరిట్( Spirit ) ఉన్నాయి.
రామ్ చరణ్( Ram Charan ) బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
బుచ్చిబాబు ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
"""/" /
సుకుమార్ సైతం డైరెక్టర్ బుచ్చిబాబుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఎన్టీఆర్,( NTR ) ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా డ్రాగన్ సినిమాలో ట్విస్టులు కొత్తగా ఉండనున్నాయని భోగట్టా.
ఎన్టీఆర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. """/" /
ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రభాస్( Prabhas ) సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.
ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
త్వరలో ఈ సినిమా షూట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ ఈ సినిమాతో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.