టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి పేరును సంపాదించుకున్న హీరోయిన్లలో ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) ఒకరు.హీరోయిన్ గా కంటే ఐటం సాంగ్స్ లో ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
చూడటానికి అందంగ కనిపించే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ నోరు జారడం ద్వారా తీవ్రస్థాయిలో విమర్శల పాలవుతుండటం గమనార్హం.
ఉత్తరాదిన తనకు గోపురాలు కట్టారంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా ఆమె తన పేరుపై గుడి( Temple ) ఉందని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు అభిమానం చూపిస్తున్నారని మాత్రమే చెప్పారని వివరణ ఇచ్చుకోవడం జరిగింది.
అయితే ఊర్వశి రౌతేలా గుడి గురించి చేసిన కామెంట్ల విషయంలో అర్చకులు ఫైర్ అయ్యారు. అర్చకులు( Priests ) ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖాండ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఊర్వశి రౌతేలా సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన సమయంలో చేసిన కామెంట్లు సైతం ఒకింత వివాదాస్పదం అయ్యాయి.మరో స్టార్ హీరోయిన్ తో కంపేర్ చేస్తూ ఆమె చేసిన కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.ఊర్వశి రౌతేలా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఆమె కెరీర్ పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి.ఊర్వశి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

ఊర్వశి రౌతేలా భాషతో సంబంధం లేకుండా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని పెంచుకుంటున్నారు.ఊర్వశి రౌతేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇతర నటీమణులకు భిన్నంగా ఊర్వశి రౌతేలా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఊర్వశి రౌతేలాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.







