1.చింతామణి నాటకం పై హైకోర్టులో విచారణ

చింతామణి నాటకంను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తో పాటు, మరికొంత మంది కళాకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విచారణకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
2.యశ్వంత్ సిన్హా కు జెడ్ క్యాటగిరి భద్రత
బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది.
3.గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి ఊరట

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ కి సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.జకియ జాఫ్రీ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
4.పులి సంచారం
కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
5. షర్మిల వినతి

తెలంగాణ ప్రజలు ఈసారి బాగా ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోరారు.
6.అధికారుల పై చంద్రబాబు కామెంట్స్
ఏపీలో కొంతమంది అధికారుల తీరును ఉద్దేశించి టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .గాడితప్పిన ప్రతి అధికారి పైన తాము అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
7.రామ్ గోపాల్ వర్మకు రాజా సింగ్ వార్నింగ్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై వర్మ ట్వీట్ బాధాకరమని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
8.సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన
సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
9.మినీ మహానాడు వేదిక ఏర్పాటుకు శంకుస్థాపన

కృష్ణాజిల్లా గుడివాడ లో ఈనెల 29న గుడవల్లేరు అంగలూరు గ్రామంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసా కార్యక్రమం జరగనుంది .ఈ మేరకు స్థానిక రైతులతో కలిసి మహానాడు వేదిక ఏర్పాటుకు టీడీపీ కీలక నేతలు శంకుస్థాపన చేశారు.
10.నేడు చంచల్ గూడా జైలుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చంచల్ గూడా కూడా జైలుకు వెళ్లనున్నారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టైన అభ్యర్థులతో ఆయన ములాఖాత్ కానున్నారు.
11.ఆరోగ్య శాఖ ఉద్యోగుల రేషనలైజేషన్

ఆరోగ్య శాఖ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ మొదలైంది.తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 250 మంది డాక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయించారు.
12.ప్రాజెక్టుల్లో పెరుగుతున్న ఇన్ ఫ్లో
ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లో పెరుగుతోంది.
13.ఎన్ డి ఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీఏ కూటమి తరపున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
14.సీఎం జగన్ తో కిడాంబి శ్రీకాంత్ భేటీ
ఏపీ సీఎం జగన్ ను భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
15.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.నేడు ఓపెన్ టెన్త్ ,ఇంటర్ ఫలితాలు
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెల్లడించారు.
17.నేడు ఏపీ కేబినెట్ భేటీ

మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం అయ్యింది.
18.ఆరోగ్య అత్యవసర పరిస్థితి గా మంకీ పాక్స్
మంకీ పాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి గా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.ఈ అంశంపై గురువారం కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
19.ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

నేడు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది.ఉదయం 11 గంటలకు సమన్వయ కమిటీ సమావేశం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన జరిగింది.
20.ద్రౌపది ముర్ము కు మద్దతు ప్రకటించిన వైసీపీ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ద్రౌపది ముర్ము కు ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతు తెలిపింది
.