ఇండియాలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ విల్లా ( 3D Printed Villa )చూశారా చూస్తే మీ మతి పోవాల్సిందే.దాన్ని పూణేలో( Pune ) కట్టారు, చూస్తే కళ్లు తిప్పుకోలేరు.
ఇలాంటి ఇళ్లను చూపించే కంటెంట్ క్రియేటర్ ప్రియం సరస్వత్, ఈ అద్భుతమైన ఇంటి వీడియోను ఇన్‌స్టాలో పెట్టాడు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూణేలోని హింజేవడి దగ్గర మాన్ లో ఉన్న గోద్రెజ్ ఈడెన్ ఎస్టేట్ ప్రాజెక్టులో( Godrej Eden Estate project ) ఈ విల్లా ఉంది.గోద్రెజ్ ప్రాపర్టీస్ వాళ్ళు, చెన్నైకి చెందిన త్వష్ట ఇంజనీరింగ్ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి దీన్ని కట్టారు.
కేవలం నాలుగు నెలల్లోనే ఈ విల్లా రెడీ అయిపోయింది.ఈ సంవత్సరం జూన్ నెలలో దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ఈ ఇల్లు మామూలుగా ఇటుకలు, సిమెంటుతో కట్టలేదు, ప్రింట్ చేశారు.కట్టే చోట ఒక పెద్ద 3D ప్రింటర్ ను పెట్టారు.ఆ ప్రింటర్ స్పెషల్ సిమెంటును లేయర్ల మీద లేయర్లుగా వేస్తూ ఇల్లు మొత్తం కట్టేసింది.ఈ ప్రింటింగ్ టెక్నాలజీతో గోడలు చూడటానికి చాలా కొత్తగా, టెక్స్‌చర్డ్‌గా ఉన్నాయి.
అంతేకాదు, గోడలు రెండు పొరలుగా ఉండి మధ్యలో ఖాళీ కూడా ఉంది.దానివల్ల కరెంట్ వైర్లు, నీళ్ల పైపులు, ఏసీ పైపులు పెట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుంది.
ఈ ఇల్లు ఏకంగా 2,038 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.లోపల చూస్తే విశాలమైన హాల్, రెండు బెడ్ రూమ్ లు ఉన్నాయి.
ఇక డిజైన్ అయితే అదుర్స్, ఫ్యూచర్‌లో ఇళ్లు ఇలాగే ఉంటాయేమో అనిపిస్తుంది.మూలలన్నీ గుండ్రంగా, స్మూత్‌గా ఉన్నాయి.
సాధారణ ఇళ్లలా కాకుండా ఇది చాలా మోడరన్ లుక్‌లో, కొత్తగా ఉంది.
నెటిజన్లు అయితే ఈ విల్లాను చూసి అవాక్కవుతున్నారు.ఒక నెటిజన్ అయితే “ఆ 3D ప్రింటర్ ఎలా ఉంటుందో చూడాలి” అని కామెంట్ చేశాడు.ఇంకొకరు “నేను ఇంతకుముందు ఇలాంటి టెక్నాలజీని చూడలేదు, వినలేదు.నిజంగా అద్భుతం.” అని మెచ్చుకున్నారు.మరికొందరు డిజైన్ చాలా బాగుందని అంటుంటే, ఇంకొందరు సిమెంటు ఎక్కువ వాడారని, భవిష్యత్తులో మట్టి లేదా సున్నం లాంటి పర్యావరణ అనుకూలమైన మెటీరియల్స్‌ను వాడొచ్చు అని సలహా ఇస్తున్నారు.ప్రియం సరస్వత్ గతంలో కూడా ఇలాంటి వింతైన ఇళ్లను మనకు పరిచయం చేశాడు.
కేరళలో కార్ పార్టులతో చేసిన ఇల్లు, బెంగళూరులో సిమెంటు లేకుండా కేవలం రాళ్లతో కట్టిన ఇల్లు లాంటి వాటి వీడియోలు కూడా తన ఇన్‌స్టాలో ఉన్నాయి.