మహిళలు( Women ) సాధారణంగా తమ ఆరోగ్యం విషయంలో కాస్త ఆలసత్వం వహిస్తారు.అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడడంలోనే ఆడవాళ్లు ముందుంటారు.
అలాంటి వారు తమ గురించి మాత్రం మర్చిపోతారు.ఆరోగ్యపరంగా స్త్రీల ఈ ఆలసత్వం( Tiredness ) వలన వారికి తీవ్రమైన వ్యాధులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మహిళా రోగుల సంఖ్య పెరగడమే కాకుండా ఎంతో మంది అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు.అయితే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునే మనం, మన ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే మధ్య వయసులో మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

50 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన మహిళల పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.అయితే 50 ఏళ్ల లోపు మహిళలు ఎదుర్కునే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.అయితే వీటిని ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
మధుమేహం 50 ఏళ్లు పైబడిన మహిళల్లో హార్మోన్ల మార్పుల వలన( Hormonal Changes ) పొత్తికడుపులో కొవ్వు పెరగడానికి ఇది కారణం.అధిక కొవ్వు ఇన్సూలేన్స్ కూడా నిరోధిస్తుంది.
ఇది మధుమేహానికి దారితీస్తుంది.మహిళలు ఎదుర్కొనే సాధారణమైన సమస్యలో రక్తపోటు కూడా ఒకటి.
అధిక రక్తపోటు, మధుమేహం వంశపారంపర వ్యాధుల వంటి జీవనశైలి వ్యాధులు అని చెప్పవచ్చు.

మహిళలు ఎదుర్కొనే మరో ఆరోగ్య సమస్య ఏమిటంటే అధిక బరువు( Overweight ).అధిక బరువు వలన మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన, పాటించవలసిన ఎన్నో విషయాలను మర్చిపోతాము.అలాగే ఊబకాయం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అలాగే థైరాయిడ్ బ్యాలెన్స్( Thyroid ) లేనప్పుడు కూడా థైరాయిడ్ కి సంబంధించి కొన్ని సమస్యలు వస్తాయి.థైరాయిడ్ బ్యాలెన్స్ లేనప్పుడు అది జీవక్రియ శక్తి స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, సంతానోత్పత్తి, బరువు పెరగడం, తగ్గడం, రుతుక్రమం, జుట్టు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, హృదయ స్పందన రేటు వంటి శరీర పనితీరును ప్రభావితం చేస్తాయి.
కాబట్టి ఈ సమస్యలు ఉన్నప్పుడు మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.