టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Hero Natural Star Nani ) గురించి మనందరికీ తెలిసిందే.నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల కాలంలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి.
కాగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి, అనుకోకుండా నటుడిగా మారిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఎదిగారు.నేడు కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3.( Hit3 ) మే 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు గుర్తు లేదు.

మా టీం మెంబర్స్ చెక్కులు తీసుకొస్తే సంతకాలు చేసి ఇచ్చేవాడిని.వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను.కానీ నేను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ నాకు ఎంతో స్పెషల్ అని నాని తెలిపారు. 4 వేల రూపాయలు ( 4 thousand rupees )నా చేతికి వచ్చిన ఫస్ట్ సాలరీ.దాని కంటే ముందు ఒక సినిమాకి రూ.2500 చెక్ అందుకున్నాను.ఆ సినిమాకి అప్రెసెంట్ గా జాయిన్ అయ్యాను.అప్రెసెంట్ కి సాలరీ ఉండేది కాదు.ఏదోకటి నేర్చుకుందాం అని చేరాను.కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పని చేశాను.
క్లాప్ అసిస్టెంట్ గా చేశాను.చివరి షెడ్యూల్ వచ్చే సమయానికి ఎందుకనో అందరితో పాటుగా నాకు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చారు.

అందరూ వెంటనే తమ చెక్కులను బ్యాంకులో వేసుకున్నారు.నేను మాత్రం రూ.2500 చెక్ అందరికీ చూపించుకుంటూ తిరిగి, 20 రోజుల తర్వాత బ్యాంకులో వేసాను.అది బౌన్స్ అయింది.
ఫస్ట్ మెమోరీ కాబట్టి, దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాను.అలా టెక్నికల్లీ ఆ డబ్బులు రాలేదు.రెండో సినిమా అల్లరి బుల్లోడు సినిమాకి మొదటి నెల సాలరీగా రూ.4 వేలు ఇచ్చారు.చెక్ మాత్రం ఇవ్వొద్దని అడిగితే, క్యాష్ ఇచ్చారు.అన్నీ 100 రూపాయల నోట్లు ఇవ్వడంతో, ఆ కట్టని జేబులో పెట్టుకొని నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్లు బయలుదేరాను.
ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాను.మరో మూడు నాలుగు నెలల సాలరీ సేవ్ చేసి మా అమ్మానాన్నలకు ఉంగరాలు చేయించాను.
అది మెమోరీగా ఉండిపోయింది అంటూ నాని తన మొదటి సంపాదనను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.