తమన్నా ఓదెల2 సినిమాకు భారీ షాక్.. ఆ పేరును అభ్యంతరకరంగా వాడారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamannaah ) నటించిన లేటెస్ట్ సినిమా ఓదెల 2( Odela 2 ).ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 17న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.

 Complaint On Odela 2 To Bc Comission, Odela 2, Odela 2 Movie, Tollywood, Bc Comi-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ఒక భారీ షాక్ తగిలింది.

ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌ కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది.అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది.

ఈ నెలలో విడుదలైన ఓదెల 2 సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాదప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది.శుక్రవారం పిచ్చగుంట్ల కులానికి చెందిన పి.

మల్లేష్( P.Mallesh ) అనే వ్యక్తి బీసీ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారని తెలిపిన కమిషన్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరినట్టు వెల్లడించింది.అయితే ఈ విషయంపై ఇది వరకే అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.

Telugu Bc, Odela, Tamanna, Tollywood-Telugu Top Posts

ఈ విషయమై సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ కు లేఖ రాస్తూ, వెంటనే దర్యాప్తు చేసి సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతరకర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ కోరింది.ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఈ అభ్యంతరకర పదాలు ఉన్న చిత్రానికి, ఆ పదాలు తొలగించకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పు పట్టింది.ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ చిత్రంలో ఇకపై జరిగే ప్రదర్శనలలో ఈ అభ్యంతరకర పదాలను తక్షణం తొలగించాలని కమిషన్ డిమాండ్ చేసింది.

తెలంగాణ డీజీపీకి ఈ లేఖ కాపీని పంపిస్తూ, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది.ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube