పిల్ల‌లు పుట్ట‌డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా.. అయితే వీటి జోలికి అస్స‌లు వెళ్ల‌కండి!

వివాహం అయిన తర్వాత ఏదో ఒక సమయంలో దంపతులకు పిల్లలు కావాలనే కోరిక పుడుతుంది.మీరు కూడా పిల్లల్ని కనాల‌నుకుంటున్నారా.? పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా.? అయితే కచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సంతానోత్పత్తి చికిత్స తీసుకుంటున్న‌ప్పుడు మీ శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాలి.అందుకు అనుకూలమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే కొన్ని కొన్నిటికి దూరంగా కూడా ఉంటాయి.

 These Are The Foods You Should And Shouldn't Eat During Fertility Treatment , Tu-TeluguStop.com
Telugu Foods, Fertility, Tips, Latest-Telugu Health

పిల్ల‌లు పుట్ట‌డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో మొద‌ట తెలుసుకుందాం.బీన్స్ మరియు కాయధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్‌, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల అవి సంతానోత్పత్తిని పెంచడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

పిల్ల‌ల‌ను క‌నాల‌ని ట్రై చేస్తున్న‌వారు న‌ట్స్‌, సీడ్స్( Nuts seeds ) ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోండి.బాదం, వాల్ న‌ట్స్‌, పిస్తా, జీడిప‌ప్పు, గుమ్మ‌డి గింజ‌లు, పొద్దుతిరుగుడు గింజ‌లు, అవిసె గింజ‌లు వంటి వాటిని తీసుకోండి.

త‌ద్వారా పురుషుల్లో వీర్యకణాల శక్తి పెరుగుతుంది.మ‌రియు స్త్రీల‌లో గ‌ర్భాశ‌య స‌మ‌స్యలు ( Uterine problems women )దూరం అవుతాయి.

దంప‌తుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది.

Telugu Foods, Fertility, Tips, Latest-Telugu Health

అలాగే యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ గా ఉండే బెర్రీ పండ్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కు మంచి మూలమైన‌ సాల్మన్ చేప‌లు, విటమిన్ డి, కాల్షియం మరియు ప్రోబయోటిక్స్ అధికంగా పెరుగును త‌ప్ప‌కుండా డైట్ లో చేర్చుకోండి.ఇక ఇప్పుడు వేటికి దూరంగా ఉండాలో కూడా తెలుసుకుందాం.పిల్ల‌లు పుట్ట‌డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ప్రాసెస్ చేసిన మాంసం జోలికి అస్స‌లు వెళ్ల‌కండి.

సోయా ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండండి.పాదరసం ఎక్కువ‌గా ఉండే ట్యూనా ఫిష్‌ను ( Tuna fish )తిన‌వ‌ద్దు.

జంక్ ఫుడ్‌, షుగ‌ర్‌, మైదా, బేక‌రీ ఫుడ్స్ ను ఎవైడ్ చేయండి.ఆల్క‌హాల్‌, స్మూకింగ్ అల‌వాట్లు ఉంటే త‌ప్ప‌కుండా మానుకోండి.

ఎందుకంటే, ఇవి పునరుత్పత్తి వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ మరియు దాని నాణ్యతను త‌గ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube