బెగ్గర్ సినిమాతో పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం వస్తుందా.. లక్ష్యాన్ని సాధించాలంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Puri Jagannadh Vijay Sethupathi Beggar Details, Vijay Sethupathi, Beggar Movie,-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ఆయన కెరియర్ కాస్త డల్ అయింది అని చెప్పాలి.మరి ముఖ్యంగా ఆయన చివరిగా దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్, లైగర్ వంటి సినిమాలతో కెరియర్ డీలా పడిపోయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ రెండు సినిమాలు ఊహించిన విధంగా ప్లాప్ అవడంతో కమ్ బ్యాక్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు పూరి.

Telugu Beggar, Charmi Kaur, Pan India, Puri Jagannadh, Purijagannadh, Radhika Ap

నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయిన పూరీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో( Vijay Sethupati ) మూవీని ఓకే చేయించుకున్నాడు.తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసేందుకు ఒక బిగ్ స్కెచ్ వేస్తున్నాడు పూరి జగన్నాథ్.తాజాగా ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టి అప్పుడే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

అయితే విజయ్ సేతుపతి వంటి నటుడితో పూరి ఎలాంటి కథను అందిస్తారనే దానిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.పూరి సొంత నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్( Puri Connects ) బ్యానర్‌ పై ఈ సినిమా రూపొందనుందని, ఎప్పటిలాగే ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుంది.

అయితే ఈ మూవీకి బెగ్గర్( Beggar ) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.ఈ మూవీలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపించనున్నాడట.

అందుకే ఈ టైటిల్ ను పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

Telugu Beggar, Charmi Kaur, Pan India, Puri Jagannadh, Purijagannadh, Radhika Ap

ఈ సినిమాతో పాత పూరి బయటకు వచ్చేలా అదిరిపోయే స్ట్రిప్ట్ తో వచ్చేస్తున్నాడట.సేతుపతి కోసం బాలీవుడ్ నటి టబుతో పాటు రాధిక ఆప్టేను కూడా రంగంలోకి దింపుతున్నారట.ఇప్పటికే స్టోరీ లాక్ అవ్వడంతో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.

మామూలుగానే పూరీ జగన్నాథ్ సినిమా అంటే జెట్ స్పీడ్ గా సాగుతుంది.మూడు నాలుగు నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేస్తాడు.

ఇప్పుడు విజయ్ సేతుపతితో చేయనున్న సినిమాకు కూడా ఆ పార్ములానే అప్లై చేయనున్నాడట.మరో రెండు నెలల్లో అనగా జూన్‌ లో సెట్స్‌ పైకి తీసుకెళ్లి కేవలం 60 రోజుల్లోనే సినిమాను ఫినిష్ చేయాలనుకుంటున్నాడట.

ఇటు విజయ్ సేతుపతి సైతం సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేయాలని సూచించాడట.దీంతో నాన్ స్టాప్ గా షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాక ఒక మురికివాడ సెట్ ను వేయాలనుకుంటున్నారట.ఈ సెట్ వర్క్ కంప్లీట్ అవ్వగానే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

మరి విజయ్ సేతుపతితో పూరి సినిమా కొత్త ఊపిరి పోస్తుందో లేదో అనేది చూడాలి మరి.కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube