వయసు పెరిగే కొద్దీ స్కిన్ లో( Skin ) ఎన్నో చేంజెస్ వస్తుంటాయి.కండరాలు దృఢత్వాన్ని కోల్పోయి చర్మం సాగడం, ముడతలు పడడం జరుగుతుంటుంది.
అలాగే చర్మం అనేది రఫ్ గా మారిపోతుంటుంది.అయితే ఏజ్ పెరిగిన కూడా యంగ్ అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ ను పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ చాలా అంటే చాలా సూపర్ గా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక ఆరెంజ్( Orange ) పండు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ( Egg White ) వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ తేనె( Honey ) వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా స్మూత్ బ్రష్ సహాయంతో ముఖానికి ఒకటికి రెండుసార్లు పూతలాగా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం గోరువెచ్చని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ ఆరెంజ్ ఎగ్ మాస్క్ తో చాలా బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా ఆరెంజ్ లోని విటమిన్ సి చర్మాన్ని బ్రైట్ చేస్తుంది.పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.ఆరెంజ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ యవ్వనమైన మెరిసే చర్మాన్ని పోత్సహిస్తాయి.అలాగే ఎగ్ వైట్ ఎలాస్టిసిటీని పెంచి చర్మాన్ని టైట్ చేయడంలో సహాయపడుతుంది.చర్మంపై ఎక్సెసివ్ ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది.
యూత్ ఫుల్ లుక్ ను అందిస్తుంది.

ఇక తేనె ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్.ఇది చర్మానికి చక్కని హైడ్రేషన్ ను ఇస్తుంది.తేనెలోని యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి.
ఇవిపింపుల్స్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.మరియు తేనె చర్మాన్ని సాఫ్ట్ అండ్ గ్లోయింగ్‌గా కూడా మార్చుతుంది.
కాబట్టి, యంగ్ అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ ను పొందాలనుకుంటే తప్పకుండా ఈ ఆరెంజ్ ఎగ్ మాస్క్ ను ప్రయత్నించండి.