నువ్వులు( Sesame seeds ).వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
చూసేందుకు చిన్నగా ఉన్నా నువ్వుల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, ప్రోటీన్, డైటరీ ఫైబర్ మెండుగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా నువ్వులు మనకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి నువ్వులు ఒక వారం అని చెప్పుకోవచ్చు.శరీరంలో వేడిని పుట్టించి కొవ్వును కరిగించే సామర్థ్యం నువ్వులకు ఉంది.
రోజు ఉదయం రెండు స్పూన్ల నువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు నువ్వులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి .మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నువ్వులను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల పాలు సిద్ధం అవుతాయి.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ నువ్వుల పాలను తీసుకోవాలి.
ఈ మిల్క్ హెల్త్ పరంగా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.రోజు ఈ మిల్క్ ను తాగితే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.బెల్లీ ఫ్యాట్ సమస్య సైతం దూరం అవుతుంది.అంతేకాదు ఈ నువ్వుల పాలును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ అందుతుంది.
రక్తహీనత( Anemia ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.వయసు పైబడిన సరే మోకాళ్ళ నొప్పులు వేధించకుండా ఉంటాయి.
మరియు మెదడు కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తుంది.