ఓ వ్యక్తి తలపై రిఫ్రిజిరేటర్( Refrigerator ) పెట్టుకుని సైకిల్‌పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో ఆ వ్యక్తి తన తలపై పెద్ద రిఫ్రిజిరేటర్‌ని ఉంచుకుని రద్దీగా ఉండే వీధిలో చాలా సులభంగా తొక్కడం చూడవచ్చు.
అంత పెద్ద రిఫ్రిజిరేటర్ తలపై ఉన్న అతడి మెడ కొంచెం కూడా తొణకలేదు.మెడ ఎంత దృఢంగా ఉంటెనో ఇలాంటి స్టంట్ చేయడం సాధ్యమవుతుంది.
అమెరికాలోని న్యూయార్క్( New York ) వీధుల్లో ఈ వీడియో చిత్రీకరించారు.ఈ యువకుడి అద్భుతమైన ఫీట్ అతనికి “ప్రపంచంలో బలమైన మెడ” అనే బిరుదును సంపాదించిపెట్టింది.”న్యూయార్క్ నగరం చాలా డిఫరెంట్” అని వీడియో క్యాప్షన్ గా రాశారు.

ఈ వీడియో చూసి సోషల్ మీడియా( Social media ) వినియోగదారులు ఆశ్చర్యపోయారు.ఇది ఎలా సాధ్యమైందని నోరెళ్లబెడుతున్నారు.సైకిల్ తొక్కేటప్పుడు మనిషి తలపై అంత బరువైన వస్తువును బ్యాలెన్స్ చేస్తాడని ఇప్పటివరకు తాము ఊహించలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు అసలు అతని తలపై రిఫ్రిజిరేటర్ ఎలా వచ్చిందని? ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

ఓ వ్యక్తి తమ స్టవ్ తలపై ఎత్తుకొని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చమత్కరించారు.హైతీలో ఓ వ్యక్తి కుక్కపిల్లతో వెళుతున్నప్పుడు పెద్ద కిచెన్ సెట్‌ను తలపై మోయడం తాము చూశామని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఈ వీడియోను ఏడు మిలియన్ల సార్లు వీక్షించారు.
రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇది అసాధ్యమైన పనిలా అనిపించవచ్చు, అయితే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కాకపోతే దీన్ని చేయడానికి సంవత్సరాల శిక్షణ అవసరం.
ఇలాంటి పనులు చేసే అథ్లెట్లు, ప్రదర్శకులు అవసరమైన కండరాలు, నైపుణ్యాలను పెంపొందించడానికి తీవ్రంగా శిక్షణ ఇస్తారు.సైకిల్ తొక్కేటప్పుడు తలపై ఫ్రిజ్‌ని బ్యాలెన్స్ చేయడం కేవలం బలంపై ఆధారపడిన ఫీట్ మాత్రమే కాదు, దీనికి మంచి సమతుల్యత, ఏకాగ్రత కూడా అవసరం.
బ్యాలెన్స్‌ను కొద్దిగా కోల్పోతే, కింద పడిపోయి గాయపడే అవకాశం ఉంది.వీడియోలోని వ్యక్తి శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా ఏకాగ్రతతో, కచ్చితత్వంతో ఉన్నాడు.







