సుమారు 30 సంవత్సరాల క్రితం.మోడలింగ్ అంటే పెద్దగా పట్టని రోజులు.
అంతేకాదు.మోడలింగ్ చేసే వాళ్లు అంటే క్వాలిటే తక్కువ మనుషులు చేసే పని అని భావించే వాళ్లు.
సరిగ్గా అదే సమయంలో ఓ కుర్రాడు మోడల్ కావాలి అనుకున్నాడు.తన కలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు.
అనుకున్నది సాధించాడు.మోడల్ అయిపోయాడు.
అంతేకాదు.మేల్ మోడలింగ్ కు ఓ బ్రాండ్ గా నిలిచాడు.
తనతో పాటు ఈ రంగంలోకి వచ్చే వారందరికీ ఓ గుర్తింపు, పేరు వచ్చేలా చేశాడు.ఆయన మరెవరో కాదు.
దిగ్గజ నటుడు జాకీ ష్రాఫ్.
మోడల్ వచ్చిన గుర్తింపు జాకీ ష్రాఫ్ కు సినిమాల్లో అవకాశాలను తెచ్చి పెట్టాయి.బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.హీరో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంది.కానీ.
ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాలేదు.అయినా తను ఏమాత్రం బాధ పడలేదు.
విలన్ పాత్రలు పోషించాడు.బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత వ్యాపారం రంగలోకి దిగాడు.రకరకాల బిజినెస్ లు చేశాడు.
అయితే ఏదీ తనకు కలిసి రాలేదు.నష్టాలపాలయ్యాడు.
అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న తను.రోడ్డు పడే స్థితి వచ్చింది.అయినా చెడ్డ పేరు రాకూడదనే ప్రయత్నం చేశాడు.అన్ని ఆస్తులను అమ్మి అప్పులు చెల్లించాడు.తన పిల్లల ఆకలి తీర్చడం కోసం అన్ని వస్తువులను అమ్మాడు.చివరకు తను పడుకునే బెడ్ కూడా అమ్ముకున్నాడు.
ఒకప్పుడు బాలీవుడ్ లో వెలుగు వెలిగిన నటుడు కటిక దరిద్రం పాలయ్యాడు.ఏసీ గదుల్లో పడుకున్న వ్యక్తి కటిక నేల మీద పడుకున్నాడు.ఎన్నో కష్ట నష్టాలు పొందినా.తను మాత్రం ఎక్కడా కుంగిపోలేదు.బాధాకర పరిస్థితులను కూడా గౌరవంగా స్వీకరించాడు.ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్నాడు.
బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న టైగర్ ష్రాప్ కి తండ్రిగా మంచి గౌరవాన్ని దక్కించుకున్నాడు.