40 ఏళ్ళు దాటాక తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇవి

మనిషి జీవితం 40 ఏళ్ళ వయసుకి ముందు ఒకలాగా, ఆ వయసు దాటిన తరువాత మరొకలాగ ఉంటుంది.బాధ్యతలు పెరగటం వలన, శరీర మార్పుల వలన, స్ట్రెస్ ఎక్కువై మానసికంగా, రోగాలు దగ్గరై శారీరకంగా సతమతమవుతుంటారు.

 Lifestyle Changes One Must Adopt After 40 Years-TeluguStop.com

అందుకే ఆ వయసుకి రాగానే మన లైఫ్ స్టయిల్ లో మార్పులు చేయాలి.

* మూడుపదుల వయసు దాటాక మెల్లిగా కండరాల్లో మాస్ తగ్గుతూ ఉంటుంది.

రక్తం సరఫరా కూడా స్లో అయిపోతుంటుంది.కాబట్టి, వ్యాయామం కంపల్సరీ.

లేదంటే, 50 నుంచి జీవితం కష్టంగా తయారవుతుంది.

* ఆ వయసులో మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.

కాబట్టి ఫైబర్ కంటెంట్ ఒంట్లో ఎక్కువ పడాలి.రైస్ తగ్గించి రొట్టె తినాలి.

ఫైబర్ ఉండే ఫలాలు ఎక్కువ తీసుకోవాలి.

* ఎముకలు అరిగిపోతాయి, బలహీనమవుతాయి.

కాబట్టి కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి.

* కంటిచూపు జాగ్రత్త.

విటమిన్ సి ఉండే పదార్థాలు తినాలి.మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి.

* వయసు పెరిగినాకొద్ది శరీరంలో సోడియం నీళ్ళ శాతం బ్యాలెన్స్‌ తప్పుతుంది.కాబట్టి ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి.

అంటే నీళ్ళు బాగా తాగాలి.

* వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ .అన్ని లెక్కలు వేసుకోండి.ఫ్యాట్ ఉంటే కరిగించండి.

బలహీనంగా ఉంటే బరువు పెంచండి.

* విటమిన్ ఏ, సీ, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.

ఈ వయసులో లేని ఆరోగ్య సమస్యలు శరీరం మీద దాడికి వస్తాయి.కాబట్టి రోగనిరోధకశక్తి పెంచుకోవాలి.

* మరో ముఖ్యమైన విషయం, మెంటల్ హెల్త్ ముఖ్యం.నవ్వండి, ప్రశాంతంగా ఉండండి.

మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube