కళ్ళ చుట్టూ నలుపుతో కలవరపడొద్దు.. ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను ట్రై చేయండి!

కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఐరన్ లోపం వంటివి కళ్ళ చుట్టూ నలుపు ఏర్పడటానికి ప్రధాన కారణాలు.కళ్ళ చుట్టూ చర్మం నల్లగా మారడం వల్ల ముఖంలో కాంతి తగ్గిపోతుంది.

 Homemade Cream For Get Rid Of Dark Circles! Homemade Cream, Dark Circles, Latest-TeluguStop.com

ముఖం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా సరే నల్లటి వ‌ల‌యాలు అందాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి.ఈ కారణంగానే కళ్ళ చుట్టూ నలుపును వదిలించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.

అయితే ఇకపై కళ్ళ చుట్టూ నలుపుతో కలవరపడొద్దు.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను ట్రై చేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు దూరమవుతాయి.

కళ్ళు చుట్టూ చర్మం తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం నల్లటి వలయాలను దూరం చేసే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా మరిగిన తర్వాత రెండు టీ బ్యాగ్స్ ను వేసి డిప్ చేస్తూ ఉండాలి.

ఇప్పుడు ఈ గ్రీన్ టీ ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్, వ‌న్‌ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరగా మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ వేసి మరోసారి మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించడానికి ముందు ఈ క్రీమ్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు బాగా కళ్ళను మసాజ్ చేసుకుని ఆపై నిద్రించాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Homemade Cream, Latest, Skin Care, Skin

ప్రతిరోజు ఈ విధంగా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.కళ్ళ చుట్టూ చర్మం మళ్లీ తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా త‌గ్గుముఖం పడతాయి.నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ క్రీమ్ ను వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube