ఇటీవల కాలంలో అధిక బరువు( Over Weight ) సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య చాలా అధికంగా పెరిగిపోతుంది.ఓవర్ వెయిట్ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను అస్సలు మిస్ అవ్వకండి.మీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా అంగుళం అల్లం( Ginger ) ముక్క తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు,( Coriander ) హాఫ్ టీ స్పూన్ జీలకర్ర( Cumin ) వేసుకోవాలి.
అలాగే ఫ్రెష్ అల్లం తరుము వేసుకొని దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాలు మరిగించాలి.దాంతో మన డ్రింక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో అర టీ స్పూన్ ఆర్గానిక్ తేనె( Organic Honey ) కలిపి సేవించడమే.ఈ డ్రింక్ వెయిట్ లాస్ అవ్వాలని భావించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.
దాంతో శరీరం అధిక కేలరీలను బర్న్ చేస్తుంది.ఫలితంగా మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు.

అంతేకాకుండా ఈ డ్రింక్ శరీరంలో కొవ్వు నిల్వలను అడ్డుకుంటుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ ను కరిగిస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అతి ఆకలి సమస్యను దూరం చేసి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే తప్పకుండా ఈ డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
సీజనల్ గా వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలను వేగంగా తగ్గిస్తుంది.మరియు తేనె కలపకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది.







