వయసు పైబడే కొద్ది తెల్ల జుట్టు( White Hair ) రావడం అనేది సర్వసాధారణం.అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, హార్మోన్ చేంజ్, కెమికల్స్ తో కూడిన కేశ ఉత్పత్తులను వాడడం, ధూమపానం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కొందరు తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.
తెల్ల జుట్టును కవర్ చేసేందుకు కలర్స్ పై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.
అయితే తరచూ హెయిర్ కు కలర్ వేయించుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి.
అందుకే కలర్స్ తో పని లేకుండా తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అందుకు చాలా బాగా సహాయపడుతుంది.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( Fenugreek Seeds ) వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.ఆ తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసి రెండూ పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇప్పుడు ఈ పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్,( Henna Powder ) వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ మరియు సరిపడా రైస్ వాటర్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ మాస్క్ కనుక వేసుకుంటే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.ఈ హెయిర్ మాస్క్ జుట్టు తెల్లబడడాన్ని రివర్స్ చేస్తుంది.జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.తెల్ల జుట్టును క్రమంగా నల్లగా మారుస్తుంది.
వైట్ హెయిర్ ను న్యాచురల్ గా నల్లగా మార్చుకోవాలి అని భావించే వారికి ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.







