సమ్మర్( Summer ) సీజన్ లో చాలా తరచుగా పలకరించే సమస్యల్లో తలనొప్పి( Headache ) ఒకటి.తలనొప్పి రాగానే ఎక్కువ శాతం మంతి పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు.
కానీ అసలు తలనొప్పికి కారణాలేంటి అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు.వేసవి కాలంలో పదే పదే తలనొప్పి ఇబ్బంది పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ప్రధానంగా చూసుకుంటే.డీహైడ్రేషన్.( Dehydration ) నీళ్లు తగినంతగా తాగకపోతే మెదడు పనితీరు ప్రభావితమవుతుంది, దీని వలన తలనొప్పి తలెత్తుతుంది.అలాగే ఎక్కువ సమయం ఎండలో ఉంటే.
శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించలేక తలనొప్పికి దారితీస్తుంది.కారం, మసాలా ఆహారాలను అధికంగా తీసుకోవడం, డైరెక్ట్ సన్ ఎక్స్‌పోజర్, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒంట్లో అధిక వేడి వల్ల కూడా తరచూ తలనొప్పి వస్తుంటుంది.
అయితే పెయిన్ కిల్లర్స్ తో పని లేకుండా సహజంగా కూడా తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.వేసవిలో ప్రతి గంటకు కనీసం ఒక గ్లాస్ నీరు తాగండి.
డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పులకు ఇది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం.

తులసి ఆకుల టీ( Tulsi Leaves Tea ) తలనొప్పి నివారణలో ఉత్తమంగా సహాయపడుతుంది.తులసి ఆకులు మరియు అల్లం నీటిలో మరిగించి టీగా తీసుకుంటే తలనొప్పి దెబ్బకు పరార్ అవుతుంది.తులసి టీకు బదులుగా మీరు పుదీనా టీను తీసుకున్న కూడా తలనొప్పి నుంచి తక్షణ రిలీఫ్ పొందవచ్చు.

సమ్మర్ సీజన్ లో తలనొప్పి నుంచి రిలీఫ్ అందించడానికి పుచ్చకాయ జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది.కూల్ కూల్‌గా ఒక గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.డీహైడ్రేషన్ వల్ల వచ్చిన తలనొప్పి దూరం అవుతుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో అర టీ స్పూన్ చక్కెర, చిటికెడు పింక్ సాల్ట్ మిక్స్ చేసి తాగారంటే శరీరం చల్లబడుతుంది.
నీరసం తగ్గిస్తుంది.తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.