జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్( Pahalgam ) ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి( Terror Attack ) దేశాన్ని కలిచివేసింది.వందలాది పర్యాటకులతో కిటకిటలాడే ఈ హిల్లీ టూరిస్టు ప్రాంతం ఒక్కసారిగా రక్తపాతం తెరలేపింది.
పర్యటన కోసం కుటుంబాలతో కలిసి వచ్చిన నిరాయుధ పౌరులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.ఈ దాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
అందులో చాలా మందికి గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.చీకట్లో వెలిగే దీపంలా ఉన్న పహల్గామ్.
ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
ఈ దారుణ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం ద్వివేది( Shubham Dwivedi ) అనే యువకుడు అమరుడయ్యాడు.
వివాహం జరిగి రెండు నెలలే అయిన శుభం, తన భార్య ఐష్ణయతో కలిసి హనీమూన్ కోసం పహల్గామ్‌కు వచ్చారు.అయితే, అది వారి చివరి ప్రయాణంగా మారింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో శుభం ప్రాణాలు విడిచాడు.పక్కన కూర్చుని భర్త చనిపోతుంటే చూసిన ఐష్ణయ కన్నీరుతోనే విలపిస్తోంది.
ఉగ్రదాడి ఘటనను తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్( CM Yogi Adityanath ) శుభం కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు.శుభం ఇంటికి వెళ్లగానే ఉద్వేగభరిత వాతావరణం ఏర్పడింది.ఆ సమయంలో శుభం భార్య మాట్లాడుతూ.“ఉగ్రమూకల దాడిలో నా భర్తను కోల్పోయాను సార్.ప్రతీకారం తీర్చుకోవాలి” అంటూ ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసింది.ఆమె మాటలు విని సీఎం యోగి కూడా కన్నీరు ఆపుకోలేకపోయారు.శుభం తల్లిదండ్రులను ఓదార్చిన సీఎం అన్ని విధాలుగా ఆదుకుంటామని, న్యాయం జరగడం ఖాయమని హామీ ఇచ్చారు.శుభం కుటుంబానికి ఆయన ఒక్కడే సంతానమని, ఆ కుటుంబానికి తన సంపూర్ణ సానుభూతిని తెలియజేశారు.
గురువారం రోజున దేవోరి ఘాట్‌లో శుభం ద్వివేది అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.వేలాదిమంది ప్రజలు పాల్గొని శుభానికి కన్నీటితో వీడ్కోలు పలికారు.సోషల్ మీడియాలో సీఎం యోగి కన్నీటి వీడియో వైరల్ అవుతున్నది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ, ఉగ్రదాడికి తగిన ప్రతీకారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
పహల్గామ్ దాడి మళ్లీ ఒకసారి ఉగ్రవాద మృగాళ్లను ప్రపంచానికి గుర్తు చేసింది.నిరాయుధ ప్రజలపై దాడి చేయడం ఎంత హేయమైన పని అనే దానికి ఇది మళ్లీ ఉదాహరణ.
శుభం ద్వివేది లాంటి అమాయకులు బలైపోతుంటే, దేశ ప్రజల గుండెల్లో ఆవేదన, కోపం కలగక మానదు.ఈ విషాద ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, దేశమంతటికీ గాయంగా మిగిలింది.