టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.చిరంజీవి గడిచిన నాలుగు దశాబ్దాలలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( Vishwambhara ) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) చిరంజీవి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సామాజిక సేవ చేయాలన్న గొప్ప ఆలోచన కలిగిన మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.మైండ్‌సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ( Mindset Shift Book Launch ) కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సానుకూల ఆలోచన, బలమైన అంకితభావం మాత్రమే సక్సెస్ సాధించడంలో తోడ్పడతాయని చెప్పుకొచ్చారు.చిరంజీవి సాధారణ కుటుంబం నుంచి వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.

నటుడు కావాలన్నదే చిరంజీవి సంకల్పం అని ఆయన తెలిపారు.చిరంజీవి మనస్తత్వం ఆయన గొప్ప శిఖరాలకు చేరడానికి దోహదపడిందని చంద్రబాబు అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అవకాశాలను వినియోగించుకుని ఆ శూన్యాన్ని పూరించడం ద్వారా ఎదగారని చంద్రబాబు పేర్కొన్నారు.బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్న మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

చిరంజీవి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే.చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.చిరంజీవి మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.