బేడి హనుమాన్ ఎవరు..? ఆయనకు బేడీలు వేయడం వెనక కారణాలేంటి?

ఆంజనేయుడు, హనుమాన్, వీరాంజనేయుడు, పవన పుత్రుడు, భజరంగబలి ఇలా అనేక పేర్లతో ఆంజనేయస్వామి వారిని కొలుస్తారు.సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ ను పూజిస్తారు భక్తులు.

 Who Is Bedi Anjaneyaswamy And Why The Lord Hanuman Got Shakles, Anjaneya Swamy,-TeluguStop.com

హనుమాన్ జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి.ప్రధానంగా ఆంజనేయస్వామి గురించి రామాయణంలో ప్రముఖంగా రామ బంటుగానే ప్రస్తావన ఉంది.

అందులో భాగంగానే ఆంజనేయ స్వామి ఐదు రూపాల గురించి కూడా అందులో ముఖ్యంగా తెలిపారు.అయితే బేడి హనుమాన్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

చాలా కొద్ది మందికి తెలిసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే నిజంగా కొంత ఆశ్చర్యంగా, మరింత భక్తి భావం కలగక మానదు.తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో స్వామికి అభిముఖంగా అంజలి బద్ధుడై ఉన్న ఆంజనేయుడే బేడి ఆంజనేయస్వామి.

కాళ్లకు, చేతులకు బేడీలు తగిలించిన మూర్తిగా హనుమాన్ కు ఆ పేరు వచ్చింది.ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు.

తిరుమలలో తపస్సు చేసి ఆమె ఈ కుమారుడిని కన్నదని ప్రతీతి.బాల్యంలో హనుమాన్ చాలా అల్లరి పనులు చేసే వాడు.

కుమారుడిని కట్టడి చేయడం కోసం అంజనా దేవి హనుమాన్ కు బేడీలు వేసి ఆ వేంకటేశ్వరస్వామికి ఎదురుగా నిలబెట్టిందని ఐతిహ్యం.ఇలాంటి బేడీ ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్య క్షేత్రం పూరీలోనూ ఉంటుంది.

పూర్వం దేవస్థానానికి పాలకులైన మహంతులు పూరీ జగన్నాథాలయంలోని సంప్రదాయం ప్రకారం బేడీ ఆంజనేయ మూర్తిని స్వామికి ఎదురుగా నిలిపారని కూడా చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube