మార్గశిర మాసం విశిష్టత ఏమిటో తెలుసా!

కార్తీక మాసం అమావాస్య ముగించుకున్న తర్వాత తెలుగు నెలలో 9వ నెలగా ప్రారంభమైంనది మార్గశిర మాసం.కార్తీక మాసం అంతా ఆ పరమశివునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందించాము.

 Do You Know What Is The Specialty Of The Margasira Month, Margasira Month, మ�-TeluguStop.com

కార్తీకమాసం శివుడికి ఎంత పవిత్రమైనదో, మార్గశిర మాసం విష్ణుమూర్తికి అంతే పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలతో పూజిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర నెలలో మార్గశిర పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉండటం వల్ల ఈ నెలకు మార్గశిర అనే పేరు వచ్చింది.

Telugu Margasira-Telugu Bhakthi

సాక్షాత్తు విష్ణు భగవానుడు మార్గశిరం అంటే నేనే అని స్వయంగా భగవద్గీతలో తెలియజేశాడు.మృగశిరా నక్షత్రంతో కూడి మార్గశిర మాసంలోకి ప్రవేశించడం వల్ల ఈనెల అందు ఎక్కువ చలి ప్రారంభమయ్యే ఈ నెల అని చెప్పవచ్చు.ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో పూజలు నిర్వహించడానికి ఉపాసన కాలం ఎంత ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం,వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనదని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు.

ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమ మైన తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు.

ఈ మార్గశిర మాసంలో వేకువజామున నిద్రలేచి తన ఇంటిని శుభ్రపరచుకుని విష్ణు ఆరాధన, పాశురాలను చదవడం, దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్టమైనది.ఈ నెలలో స్వామివారికి భక్తితో సమర్పించే ప్రతి ఒకటి స్వీకరించే మాసం ఇది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి, దత్తాత్రేయ జయంతి వంటి పవిత్రమైన పండుగలను ఈ మాసంలో జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube