ఈ సంవత్సరం ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్ ( Ramadan )మార్చి 22న మొదలవుతుంది.ఏప్రిల్ 21న ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఉంటుంది.
చంద్రుడి దర్శనం( moon ) పవిత్ర రంజాన్ మాసానికి నాంది పలుకుతుంది.ఇస్లామిక్ క్యాలెండర్( Islamic calendar ) లోని తొమ్మిదో నెలలో వచ్చే రంజాన్ ను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
రంజాన్ ఉపవాస ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రంజాన్ మాసంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ఖురాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని ప్రజలు నమ్ముతారు.
దీన్ని గౌరవించడానికి గుర్తుగా ముస్లింలు( Muslims ) ఈ ఉపవాసం ఉంటారు.ప్రజలు తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడానికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయను పొందడానికి ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈ పండుగ ఎంతో పవిత్రమైనది.ఉపవాసం ఉండేవారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం ముగిసే వరకు నెల రోజులపాటు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.

ప్రజలు ఉపవాసం మొదలు పెట్టడానికి ముందు సేహరీ అని పిలవబడే భోజనాన్ని తీసుకుంటారు.ఉదయం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల 30 నిమిషముల వరకు సేహరీ సమయం ఉంటుంది.ముస్లింలు సాయంత్రం 6.59 నిమిషములకు ఇఫ్తార్ తో ఉపవాసాన్ని విరమిస్తారు.అయితే ఎక్కువ సమయం ఉపవాసం ఉండడం చాలా కష్టం.మండే ఎండల్లో రంజాన్ పండుగ వస్తుంది.

అందుకే ఆహారంలో పుచ్చకాయ, కీర దోసకాయ, టమాటాలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.ఉపవాసం ఉన్న వారంతా సూర్యాస్తమయం వరకు మంచినీరు కూడా తాగకుండా ఉండాలి.ఎందుకంటే ఆకలి విలువ అందరికీ తెలియాలి.అంతేకాకుండా ఈ పండుగకు కొత్త బట్టలు ధరించడం, నమాజ్ చేయడం, సూర్యాస్తమయం తర్వాత కలిసి భోజనం చేయడం, పండుగ రోజున రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
అనారోగ్యంతో బాధపడేవారు, ప్రయాణం చేసేవారు, వృద్ధులు, గర్భిణీలు, పీరియడ్స్ ఉన్నవారికి ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది.