స్కూల్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం,సరి-బేసి విధానం

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 22 వ తేదీ నుంచి భారత్ లో స్కూల్స్ బంద్ అయిన విషయం తెలిసిందే.గత రెండు నెలలుగా స్కూల్స్ లేకపోవడం తో పిల్లలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.

 Schools May Go For Odd-even System After Lockdown Period, Coronavirus, Lock Down-TeluguStop.com

అయితే పెద్ద తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఆయా కాలేజీలు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. లాక్ డౌన్ ఉండటంతో ఒకటి నుంచి 12 వ తరగతి విద్యార్థుల వరకు స్కూల్స్ విషయంలో కేంద్రం తర్జనలు భర్జనలు పడుతున్నది.

స్కూల్స్ కు ఎక్కువ కాలం సెలవులు ఇవ్వడం వలన పిల్లల కెరీర్ పై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్స్ విషయంపై మానవ వనరుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

స్కూల్స్ లో సరి-బేసి విధానం అమలు చేసి విద్యార్థులకు పాఠాలు అందించాలి అంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీనికోసం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో ఎలాగైతే సరి బేసి విధానం అమలు చేశారో అలాంటి విధానాన్ని స్కూల్స్ విషయంలో అమలు చేసి 50శాతం విద్యార్థులు ఒకరోజు, మరో 50శాతం విద్యార్థులు మరొక రోజు హాజరయ్యేలా చూడబోతున్నారు.అంటే మూడు రోజులు మాత్రమే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్ళాల్సి వస్తుంది అయితే మిగతా మూడు రోజులు టీవీ ఛానల్స్ ద్వారా పాఠాలను వినాల్సి ఉంటుంది.

ఇందుకోసం కేంద్రం 12 ఛానల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. డిజిటల్ ఛానల్స్ ద్వారా మూడు రోజులపాటు స్కూల్ పాటలు, స్కూల్ ద్వారా మరో మూడు రోజులపాటు టీవీ ఛానల్స్ ద్వారా పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నది కేంద్రం.

ఈ విధానం సక్సెస్ అయితే డిజిటల్ విద్యావ్యవస్థలో పెను మార్పులు వచ్చినట్టే అని చెప్పాలి.ఇప్పటివరకూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి సరిపోయింది. కానీ జూన్ నుంచి మాత్రం స్కూళ్లు తెరచుకోవడమే మంచిదని నిపుణులు కూడా భావిస్తున్నారు.ఈ క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube