ఒక వైపు ఎన్టీఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది, మరో వైపు దర్శకుడు ఇలా అంటాడేంటీ?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పూర్తి అయిన తర్వాత చేయబోతున్న సినిమా ఏది ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అంటే చాలా మంది ఠక్కున త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా అంటూ చెబుతున్నారు.మీడియాలో కూడా వీరిద్దరి కాంబో మూవీ అంటూ చాలా వార్తలు వచ్చాయి.

 Trivikram Srinivas Give The Clarity About Ntr Movie-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌తో చర్చలు కూడా జరపడం జరిగింది.కనుక వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ల మూవీ ఖాయం అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

Telugu Alluarjun, Bunny Sukumar, Trivikram Ntr-Movie

వచ్చే ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మూవీ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఇటీవల అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ మీట్‌ సందర్బంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ తర్వాత సినిమా విషయమై నిర్ణయం తీసుకోలేదు అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్య పర్చింది.బన్నీ మాత్రం తదుపరి చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో అంటూ క్లారిటీగా చెప్పాడు.కాని త్రివిక్రమ్‌ మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా అంటూ ఎందుకు చెప్పలేదు అంటూ ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది.

Telugu Alluarjun, Bunny Sukumar, Trivikram Ntr-Movie

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ మూవీ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.అయితే మొదట ఎన్టీఆర్‌తో మూవీ ఉంటుందా లేదంటే పవన్‌తో మూవీ చేస్తాడా అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.ఒకవేళ త్రివిక్రమ్‌ కనుక ఎన్టీఆర్‌కు హ్యాండ్‌ ఇస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా ఏమై ఉంటుందా అంటూ అప్పుడే నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ ఏడాది సమ్మర్‌ వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అంటే సమ్మర్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube