స్టార్ హీరోయిన్ రష్మిక( Rashmika Mandanna )కు ప్రేక్షకుల్లో ఒకింత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే రష్మిక ఏ తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఆమెపై సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలో ట్రోల్స్ వస్తుంటాయి.
రష్మిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు.ఒక స్టార్ హీరోతో రష్మిక లవ్ లో ఉన్నారని చాలా సందర్భాల్లో ప్రచారం సాగిందనే సంగతి తెలిసిందే.
కేరళ రాష్ట్రం( Kerala )లో ప్రకృతి సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. వయనాడ్ జిల్లా( Wayanad )లోని పలు గ్రామాలు వరదలకు కొండ చరియలు విరిగిపడటం వల్ల నేలమట్టం అయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా పలువురు సెలబ్రిటీలు ఈ ఘటనలో మృతి చెందిన వారికి తమ వంతు సహాయం ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.స్టార్ హీరోయిన్ రష్మిక బాధితులను ఆదుకునేందుకు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా చాలామంది సెలబ్రిటీలతో పోల్చి చూస్తే ఆమె తక్కువ మొత్తం ప్రకటించినా సహాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారు.
అయితే రష్మిక స్వస్థలం కొడగు కాగా భూమి క్షీణత వల్ల ఆ ప్రాంతంలో సైతం కొండ చరియలు విరిగి పడి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందట.
రష్మిక వయనాడ్ బాధితులకు సహాయం చేయడం మంచి నిర్ణయమే కానీ కొడగులో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను సైతం ఆదుకుని ఆమె తన వంతు సహాయం చేసి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.రష్మిక కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుండగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నారు.ఈ నెగిటివ్ కామెంట్ల గురించి రష్మిక ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఈ ఏడాదే పుష్ప ది రూల్(Pushpa 2 ) సినిమాతో రష్మిక ప్రేక్షకుల ముందుకు రానున్నారు.