సాధారణంగా తమ వాహనాలపైన కొందరు యజమానులు వినూత్న రీతిలో కొన్ని రకాల కొటేషన్స్ రాయిస్తూ వుంటారు.అలాంటివి చూసినపుడు మనకి ఒకింత హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది.
అలాగే కొన్నిటిని చూసినపుడు చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది.మరికొన్నిటిని చూసినపుడు చాలా క్రియేటివిటీగా కనిపిస్తాయి.
ఆయా కొటేషన్స్ సదరు అభిమానుల మనసుని ప్రతిబింబించేవిగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే “నన్ను చూసి ఏడువకురా; నీ కళ్లలో కారం కొట్ట అప్పు చేసి కొన్నానురా!; ఐ లవ్ యు బంగారం; ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరం; నేనే ఆటోలకి రాజా…” ఇలా రకరకాల కొటేషన్స్ ని మనం చూస్తూ ఉంటాం.
ఇలాంటివి చూసినపుడు మనకి తమాషాగా అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చాలామంది చాలా కటువుగా రాస్తూ వుంటారు.ఈ వైరల్ ఫోటోలో కూడా అలాంటిదే కనిపించింది.ఇటీవల ఒక ఆటో రిక్షా డ్రైవర్ మహిళల కోసం పోస్ట్ చేసిన “ స్పెషల్” నోటీసు చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
కాగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఆ ఆటో డ్రైవర్ తన ఆటోపై రాసినది చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు.అందులోనూ అమ్మాయిలు అయితే ఇదేంటి? ఇలా రాసుకున్నాడు….మనం ఎలా కనిపిస్తున్నాం వీడికి? అంటూ చర్చించుకుంటున్నారు.ఇక మగ ప్రయాణికులు డ్రైవర్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడని పొగిడేస్తున్నారు.సోషల్ మీడియా యూజర్ వంశిక గార్గ్ ఇటీవల ఓ ఆటో రిక్షా బ్యాక్ సైడ్ పోస్టర్‌ను పోస్ట్ చేసారు.
దాని వెనుక ఇలా రాసి ఉంది.“సారీ గర్ల్స్, నా భార్య చాలా స్ట్రిక్ట్” అని వ్రాయబడింది.
నోటీసు చివర్లో మహిళల స్టిక్కర్లపై నిషేధం గుర్తు కూడా కనిపిస్తోంది చూడండి.మరి మీరు చెప్పండి… అది మీకు ఎలా అనిపిస్తుందో?
.






