ఇటీవల అనేక జూగాడ్ ఆవిష్కరణలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారుతున్నాయి.కొత్త కొత్త ఆవిష్కరణలతో తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు.
వినూత్న ఐడియాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్నారు.ఏదైనా వినూత్నంగా చేయాలనే ఆలోచన నుంచి పుట్టిన జుగాడ్ ఐడియాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ గా మారుతుూ ఉన్నాయి.
అలాంటి మరో జూగాడ్ ఐడియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి బైక్‌పై పిండి మిల్లు( Flour mill )ను ఏర్పాటు చేశాడు.బైక్ పై తిరుగుతూనే ఈ మిల్లును నడిపిస్తున్నాడు.చూడటానికి చాలా వినూత్నంగా ఉండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఒక ఐఏఎస్ అధాకారి దీనిని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.ఈ వీడియోలో సదరు వ్యక్తి బైక్ ( Bike )పై పిండి మెషిన్‌ను ఏర్పాటు చేసుకుని నిల్చోని ఉన్నాడు.
మెషిన్‌లో ఏవో శనగగింజలు వేస్తున్నాడు.గింజలు వేయగానే సెకన్లలోనే పిండి బయటు వచ్చింది.
ఇది ఒక రేంజ్ లో వైరల్ గా మారుతోంది.

2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.ఈ వీడియో తన తల్లి తనకు పంపించిందని, ఈ వ్యక్తి మా ఇంటికొచ్చాడని తెలిపారు.ఈ వీడియోకు 2.3 లక్షల వ్యూస్ రాగా.భారీగా లైక్స్ వచ్చాయి.
చాలామంది కామెంట్లు పెడుతున్నారు.ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.
ఈ ఐడియా చాలా బాగుందని కొంతమంది చెబుతుండగా.ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.
ఐఐటీ తెలివితేటలు అంటూ మరికొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఇటీవల అందరూ సైంటిస్టులుగా మారుతున్నారని,ఇలాంటివి కనిపెడుతున్నారంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటివి గ్రామాల్లో కామన్ అంటూ ఇంకోందరు అంటున్నారు.







