ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి ఫార్చునర్ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని సమాచారం.అయితే కారులో వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది.
మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదం జరిగిన అనంతరం విప్ పాడి కౌశిక్ రెడ్డి మరో కారులో హుజూరాబాద్ కు చేరుకున్నారు.







