మధుమేహం లేదా షుగర్ వ్యాధి.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న ధీర్ఘకాలిక సమస్య ఇది.
అయితే మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో అప్పుడప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ భారీగా పెరిగి పోతుంటాయి.అవి ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా అదుపులోకి రావు.
అయితే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను తీసుకుంటే చాలా సులభంగా మరియు వేగంగా రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక క్యాప్సికమ్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే చిన్న అల్లం ముక్క తీసుకుని పీల్ తీసేసి మెత్తగా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, దంచి పెట్టుకున్న అల్లం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
మధుమేహం వ్యాధి ఉన్న వారు క్యాప్సకమ్ వాటర్‌ను వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయి.
అలాగే అధిక బరువుతో బాధ పడుతున్న వారు, వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారు కూడా క్యాప్సికమ్ వాటర్ తీసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.తద్వారా శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగి బరువు తగ్గుతారు.
అంతే కాదు, క్యాప్సికమ్ వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి వారానికి రెండు నుంచి మూడు సార్లు సేవిస్తే గనుక రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.సీజనల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లి పోయి కిడ్నీలు శుభ్రపడతాయి.కాబట్టి, మధుమేహం ఉన్న వారే కాదు ఎవ్వరైనా క్యాప్సికమ్‌తో తయారు చేసిన ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు.