శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి శరత్ బాబు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమా పరిశ్రమల్లోనూ ఎంతో మంచి నటుడిగా పేరు సంపాదించాడు.

సుమారు 2 వేలకు పైగా సినిమాల్లో నటించాడు.తను ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమై నటించే వాడు శరత్ బాబు.1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో ఆయన జన్మించాడు.ఈయన అసలు పేరు సత్యనారాయణ.1973లో రామరాజ్యం సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.ఆ తర్వాత కన్నడ మూవీలో నటించాడు.

అనంతరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ సినిమా చేశాడు.ఆ తర్వాత అమెరికా అమ్మాయి సినిమాలో నటించాడు.ఈ సినిమా తర్వాత బాలచందర్ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది సినిమాలో యాక్ట్ చేశాడు.1981 నుంచి 19883 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాల్లో నటనకు గాను ఆయన ఈ అవార్డులు అందుకున్నాడు.

సినిమా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తను ప్రేమ వివాహం చేసుకున్నాడు.వయసులో తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైన రమా ప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సుమారు 14 సంవత్సరాల పాటు వీరి వైవాహిక బంధం కొనసాగింది.

Advertisement

ఆ తర్వాత వివాదాల కారణంగా వీరిద్దరు విడిపోయారు.విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత శరత్ బాబుపై రమప్రభా పలు సీరియస్ కామెంట్స్ చేసింది.తాను ఆశ్రయం కోసం పెళ్లి చేసుకుంట .తను అవసరం కోసం చేసుకున్నాడటని ఆరోపించింది.పలు ఇంటర్వ్యూలలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.ప్రస్తుతం శరత్ బాబు పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

తండ్రి పాత్రలతో పాటు పలు సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు.మరో పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు