కెనడాలో ముందస్తు ఎన్నికలు( Canada Early Voting ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 28న ఈ ఎన్నికలు జరగనుండగా.
ముందస్తు పోలింగ్‌కు ప్రజలు బారులు తీరుతున్నారు.రికార్డు స్థాయిలో దాదాపు 7.3 మిలియన్ల మంది కెనడా ప్రజలు ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ముందస్తు పోల్స్ ఏప్రిల్ 18 శుక్రవారం నుంచి ఏప్రిల్ 21 సోమవారం వరకు జరిగాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో( Federal Elections ) భాగంగా ముందస్తు పోల్స్‌లో 7.3 మిలియన్ల మంది ఓటర్లు ఓటు వేశారు.2021 సార్వత్రిక ఎన్నికల్లో ముందస్తుగా ఓటు వేసిన వారి (5.8 మిలియన్ల మంది) కంటే ఇది 25 శాతం పెరుగుదల అని ఎలక్షన్ కెనడా ఒక నివేదిక విడుదల చేసింది.
2021 ఫెడరల్ ఎన్నికల మొత్తం పోలింగ్ శాతంలో అది దాదాపు 42 శాతం .ఆ ఎన్నికల్లో దాదాపు 17.2 మిలియన్లు లేదా 63 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.మంగళవారం విడుదల చేసిన గణాంకాలు కేవలం అంచనా మాత్రమేనని , కొన్ని పోల్స్ ఇంకా నివేదించబడలేదని ఎలక్షన్ కెనడా పేర్కొనడంతో ముందస్తు ఓటింగ్ సంఖ్యలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం జరిగిన మధ్యంతర ఎన్నికల కంటే ఈ ఎన్నికలపై ఓటర్లలో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం అధికార లిబరల్ పార్టీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ( Canada PM Mark Carney ) నాయకత్వం వహిస్తున్నారు.జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) తప్పుకోవడంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెలలోపే కార్నీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
మరోవైపు.దేశంలో ప్రభుత్వ మార్పును కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి మద్ధతు ఇస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

అధికారం కోసం లిబరల్స్, కన్జర్వేటివ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.మిగిలిన పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.మంగళవారం విడుదల చేసిన నానోస్ రీసెర్చ్ ఏజెన్సీ గణాంకాలను బట్టి లిబరల్స్ దాదాపు 43 శాతం మంది ప్రజల ఓటర్ల మద్ధతును పొంది కన్జర్వేటివ్‌ల కంటే దాదాపు 6 పాయింట్ల ఆధిక్యంలో ఉందట.343 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికారం అందుకోవడానికి కావాల్సిన మెజారిటీ మార్క్ 172.మరి లిబరల్స్ ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకుంటారా? లేక కన్జర్వేటివ్స్ షాకిస్తారా? అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.