న్యాచురల్ స్టార్ నాని హిట్3 సినిమా( Hit 3 movie ) ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడిస్తున్న విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.సినిమా రివ్యూల గురించి నాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు అయితే ఓకే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని ఆపగలం అని నాని కామెంట్లు చేశారు.ఫలానా సీన్, ఫలానా సాంగ్ నాకు నచ్చలేదని చెప్పొచ్చని నాని పేర్కొన్నారు.
కానీ ఈ సినిమా ఆడదని డిసైడ్ చేయొద్దని నాని కామెంట్లు చేశారు.వారం, పది రోజుల పాటు ఏదైనా సినిమాని ఎవరూ చూడని పక్షంలో అప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ చేయాలని నాని తెలిపారు.
అబ్బో తలనొప్పి వచ్చేసిందని కొన్ని సినిమాల విషయంలో చెప్పడం నేను చూశానని వ్యకిగతంగా ఇలాంటి అభిప్రాయాలు ఓకే కానీ ప్రొఫెషనల్స్ కూడా అలా చేయడం తగదని నాని అన్నారు.

ఈ పోలీస్ స్టోరీలో తుపాకుల కంటే ఎక్కువగా కత్తులు ఉపయోగించడానికి కారణం ఉందని నాని తెలిపారు.వైలెన్స్ కోసమని ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని దానికో బ్యాక్ స్టోరీ ఉందని అయితే కన్నడ హీరోయిన్లు తెలుగులో రాణిస్తున్నారన్న ఉద్దేశంతో శ్రీనిధిని( Srinidhi ) ఎంపిక చేయలేదని నాని కామెంట్లు చేశారు.మృదుల పాత్ర రాయడం పూర్తైన తర్వాత ఆ రోల్ కు శ్రీనిధి శెట్టి బెస్ట్ అని డైరెక్టర్ కు అనిపించిందని చెప్పుకొచ్చారు.

కొన్ని సినిమాలలో నేను పోషించిన అర్జున్ ( Arjun )పాత్రకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారని ఇందులోనూ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తానని నాని తెలిపారు.అయితే హీరో పాత్రకు ఫలానా పేరు పెట్టాలని నేను చెప్పనని ఇది దర్శకుల ఆలోచనే అని నాని తెలిపారు.ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని నాని క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు.