బ్లాక్ హెడ్సే కాదు వైట్ హెడ్స్‌తో బాధ పడే వారు కూడా ఎందరో ఉన్నారు.మేకప్‌ను అతిగా వేసుకోవడం, చర్మంలో నూనె ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, ఎండల్లో తరచూ తిరగడం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, హార్మోన్ల మార్పులు, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ వైట్ హెడ్స్ ఏర్పడతాయి.
ఇవి అందాన్ని పాడు చేయడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తాయి.అందుకే వీటిని తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు వాడతారు.
అయితే న్యాచురల్‌గా కూడా వైట్ హెడ్స్‌ను నివారించుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చందనం పొడి వైట్ హెడ్స్‌కు చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ముందుగా ఒక బౌల్‌లో చందనం పొడి, చిటికెడు పసుపు మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమానికి చర్మానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా వైట్ హెడ్స్ తగ్గు ముఖం పడతాయి.

అలాగే బాదం కూడా వైట్ హెడ్స్‌ను నివారిస్తుంది.ఒక గిన్నెలో బాదం పొడి, తేనె మరియు పాలు వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోటు పూసి పావు గంట లేదా అర గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం కొద్దిగా వాటర్ జల్లి మెల్ల మెల్లగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
మెత్తగా పండిన టమాటా తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు వైట్ హెడ్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి.పదిహేను నిమిషాలు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటిలో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా వైట్ హెడ్స్ దూరం అవుతాయి.