హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు.వారిలో ఏ దేవుడి నామాన్ని స్మరిస్తే ఏ ఫలితం లభిస్తుందో మనం అప్పుడు తెలుసుకుందాం.
శ్రీరామ నామాన్ని జపిస్తే జయం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.దామోదరుడ్ని జపిస్తే… సకల బంధాల నుంచి విముక్తి లభిస్తుందట.
అలాగే కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి.నారాయణా అని స్మరిస్తే… సకల సర్వ గ్రహాల దోషాలు నశించిపోతాయి.
మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయంట.అలాగే అచ్చుతా అని స్మరిస్తే… తీసుకున్న ఆహారమే ఔషధంగా పని చేస్తుంది.
నరసింహా అని స్మరించడం వల్ల మీ శత్రువులపై మీదే విజయం వస్తుంది.అదే నారసింహ అని స్మరిస్తే… సకల భయాల నుంచి విముక్తి లభిస్తుంది.గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కల్గుతుంది.శ్రీమహా లక్ష్మీ విష్ణువులనూ స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది.
సర్వేశ్వరా అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది.జగన్మాతా అని జపిస్తే… సకల అరిష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.జగజ్జననీ అని స్మరిస్తే… సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.కృష్ణ కృష్ణ అని జపిస్తే.
కష్టాలు తొలుగుతాయి.శివ శివ అని స్మరిస్తే… సకలమూ లభిస్తాయంట.
మీకు ఏది కావాలి అనిపిస్తే ఆ దేవుడిని స్మరించి… మీకు కావాల్సినవి సంపాదించుకోండి.ఆ దేవుడి కృపకు పాత్రులు కండి.