కుష్మాండా దుర్గమ్మ తన శక్తితో విశ్వాన్ని సృష్టించింది.ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయి.
అమ్మవారి తేజస్సే సూర్యుడు అని కూడా అంటారు.అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి ఉంటుంది.
అయితే కూష్మాండ దుర్గమ్మ పులి వాహనంపై కూర్చుని ఉంటుంది.అమ్మవారి శక్తికి నిదర్శనంగా కనిపించే ఎనిమిది చేతుల్లో విల్లు , బాణం, చక్రం, గద, తామరపువ్వు, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది.
అష్ట భుజాలు కలిగి ఉన్నందున అష్ట్భుజాదేవిగా కూడా పిలుస్తారు.ఇంత శక్తివంతమైన కూష్మాండ దేవిని నవరాత్రుల్లో నాల్గవరోజు ఆరాధిస్తే కీర్తి , ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి.
కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయిన తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది.
ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టింది అమ్మ.
తెల్లటి వస్త్రాలు ధరించి తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి.వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉంటాయి.
కూష్మాండ దేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు.పురుషుని చర్మం పులి చర్మం, మెడ చుట్టూ ఒక పాము, అలాగే తలపై చంద్రవంకను ధరించి చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి.
కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది.మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి.ఆమెకు పేరు శక్తి అని పేరు పెట్టింది.కూష్మాండ దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు.పురుషునికి బ్రహ్మ అని పేరు పెట్టింది.బ్రహ్మ తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు.
కూష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది.ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
DEVOTIONAL