మనదేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎంతో గట్టిగా నమ్ముతారు.వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు.
అంతే కాకుండా ఇంట్లో ఏ వస్తువునైనా వాస్తు ప్రకారం ఉండే విధంగా చూసుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది అతన్ని ఏదో ఒక దిశలో ఉంచుతుంటారు.
ఇంట్లో అద్దం ఎక్కడ అమర్చిన సరే వాస్తు నియమాలను( Vastu rules ) కూడా అనుసరించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అప్పుడే ఇంట్లో వాస్తు దోషాలు కూడా కలగకుండా ఉంటాయి.

ఇంటి అలంకరణకు మాత్రమే కాదు అద్దాలు ఇంట్లో వారి వ్యక్తిత్వాలను కూడా ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు.ఇంట్లో ఏర్పాటు చేసిన అద్దాలు( mirror ) మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తానని వాస్తు శాస్త్రంలో ఉంది.అందుకే వాటిని తప్పకుండా సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి.అద్దానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే స్టోర్ రూమ్ లో అద్దాలను ఉంచినట్లయితే వెంటనే తీసేయడం మంచిది.దీని వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా స్టోర్ రూమ్ లో అవసరం లేని వస్తువులు ఉంచుతాము.ఇక్కడ కొంత నెగిటివ్ ఎనర్జీ( Negative energy ) ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
కాబట్టి ఆ స్థలంలో అద్దం పెడితే అద్దంలో పనికిరాని వస్తువుల ప్రతిబింబాలు ఏర్పడతాయి.అందువల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడి దీనివల్ల ఇంట్లో అశాంతి మొదలవుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పడుక గదిలో అద్దం ఉంచకూడదు.ఎందుకంటే అకస్మాత్తుగా నిద్ర మేల్కొన్నప్పుడు భ్రమలు కలిగే అవకాశం కూడా ఉంది.అంతే కాకుండా వంట గదిలో కూడా అర్థం అవసరం లేదు.ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర అద్దం ఉండకూడదు.మెట్ల దగ్గర కూడా కొంతమంది అద్దాన్ని పెట్టుకుంటూ ఉంటారు.ఇలా కూడా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అద్దాన్ని ఎప్పుడూ మంచి విషయాలను పట్టింపు చేసే చోట అమార్చడం మంచిది.డబ్బు దాచుకునే ప్రదేశంలో వ్యతిరేక దిశలో అద్దాన్ని అమర్చితే దాని ప్రతిమ అద్దం లో కనిపించి ధనం ఇంకా రెట్టింపు అవుతుంది.