యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు శుభవార్త..!

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి( Yadadri Lakshmi narasimha swamy ) భక్తులకు శుభవార్త ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.ఎంఎంటీఎస్ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు( Railway officials) ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

 Good News For Yadadri Lakshminarasimhaswamy Devotees  , Devotees  , Lakshmi Nara-TeluguStop.com

దీంతో యాదాద్రి కి ఎంఎంటిఎస్ పై మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి.ఆ వివరాలలోకి వెళ్తే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రన్ని సీఎం కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు.

దేవాలయం ప్రారంభమైన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది.

Telugu Devotees, Devotional, Indian Rail, Kishan Reddy, Lakshmisimha, Mmts, Rail

యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారం సెలవు రోజులలో 50వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరి గుట్టకు వస్తున్నారు.అయితే యాదగిరిగుట్టకు ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

చాలామంది భక్తులు ప్రజ రవాణా వ్యవస్థ ఆర్టీసీ సొంత వాహనాలలో వస్తున్నారు.ఈ రద్దీ నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణం వసతులు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Telugu Devotees, Devotional, Indian Rail, Kishan Reddy, Lakshmisimha, Mmts, Rail

ఈ నేపథ్యంలో ఎంఎంటిఎస్ రెండవ దశ పొడిగింపు సరైనదని భావించింది.అయితే దీనికోసం 2016 లోనే ప్రణాళికలు సిద్ధం చేసిన అది పట్టాలెక్కలేదు.తాజాగా కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి( Kishan reddy ) 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ను పొడిగిస్తామని ప్రకటించారు.ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఘాట్ కేసర్ వరకు ఎంఎంటీఎస్ రెండవ దశ కింద 21 కిలోమీటర్ల రైల్వే లైన్ ను నిర్మిస్తున్నారు.

అయితే ఘాట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు మరో 33 కిలోమీటర్లు రెండో దశను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.ఇందుకు 330 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల సమకూర్చే విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో పొడిగింపు నిలిచిపోయింది.పెరిగిన ధరల వల్ల ఈ ప్రాజెక్టు వ్యాయామం ఇప్పుడు 430 కోట్లకు పెరిగింది.

ఏం ఏం టి ఎస్ రెండవ దశ పొడిగింపు ఎప్పటికీ పూర్తి అవుతుందో లేదా కాగితాలకే పరిమితం అవుతుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube