డిసెంబర్ 13వ తేదీ నుంచి.. ఈ పుణ్యక్షేత్ర టికెట్లు ఆన్ లైన్ లో..!

మన దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎంతో భక్తి భావంతో శ్రీరాముల వారిని పూజిస్తారు.అలాగే భద్రాచలంలో( Bhadrachalam ) గోదావరి నది తీరాన వెలసిన రాములవారి దేవాలయానికి( Sri Rama Temple ) ఎంతో విశిష్టత ఉంది.

 Uttara Dwara Darshanam At Bhadrachalam On Vaikunta Ekadasi Online Tickets Detail-TeluguStop.com

మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండి భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు.

ఈ దేవాలయాన్ని రామదాసు నిర్మించాడని పండితులు చెబుతున్నారు.అయితే ఈ దేవాలయం పై ఉన్న సుదర్శన చక్రం మానవ నిర్మితం కాదని, అది దేవత నిర్మితమైనదని పురాణాలలో ఉంది.

అలాంటి ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు.అంతే కాకుండా ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీరామ చంద్ర స్వామి దేవాలయంలో డిసెంబర్ 23వ తేదీన భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయా ఈవో రమాదేవి( EO Ramadevi ) తెలిపారు.ఆలాగే డిసెంబర్ 13వ తేదీ నుంచి ఉత్తర ద్వార దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో( Online Tickets ) అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ముఖ్యంగా చెప్పాలంటే భద్రాద్రి దేవాలయ వెబ్ సైట్ లో టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ముఖ్యంగా చెప్పాలంటే భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం కోసం రెండు వేల,ఐదు వందల,రెండు వందల యాభై రూపాయల విలువ గల సెక్టార్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈవో వెల్లడించారు.ఈ టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా శ్రీరామ చంద్రస్వామిని త్వరగా దర్శించుకునే సౌభాగ్యం లభిస్తుందని దేవాలయ అధికారులు చెబుతున్నారు.ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని ఆలయ ఈవో యల్.రమాదేవి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube