మన హిందూ ఆచారాల ప్రకారం దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి తీర్ధ ప్రసాదాలను స్వీకరిస్తారు.మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి తీర్థ మనకు మూడుసార్లు వేయటం గమనించే ఉంటాము.
అయితే ఈ విధంగా ఆలయంలో స్వామివారి తీర్థం భక్తులకు మూడుసార్లు ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటో చాలామందికి తెలియకపోవచ్చు.అయితే స్వామివారి తీర్థం మూడుసార్లు ఇవ్వడం వెనక గల కారణం ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి తీర్థం తీసుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గావిష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు.అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

అయితే మూడు సార్లు తీర్థప్రసాదాలు వేయడం వెనుక గల కారణం ఏమిటంటే మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది.అదేవిధంగా రెండవసారి తీర్థం తీసుకోవడం వల్లన్యాయ, ధర్మప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.ఇక మూడవ సారి ఆ పరమేశ్వరుడికి పరమపవిత్రం అనే పదాన్ని పలుకుతూ తీర్థం తీసుకోవాలి.
పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం కనుక, ఆలయాన్ని సందర్శించిన భక్తుడు ఈ విధంగా మూడుసార్లు తీర్థం తీసుకోవటంవల్ల భోజనం చేసినంత శక్తిని లభిస్తుందని చెబుతారు.
అదే విధంగా తీర్థం తీసుకునే సమయంలో ప్రతి భక్తుడు ఎడమచేతిలో కుడిచెయ్యిని పెట్టుకొని,కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తేగోముఖం అనే ముద్ర వస్తుంది.
ఈ ముద్రతో తీర్థాన్ని సేవించడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రంతల, మెడను తాకుతాయి.ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంది.
దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి.అదేవిధంగా తీర్ధం తీసుకున్న తర్వాత చాలామంది చేతితో తలపై తాకుతుంటారు.
ఈ విధంగా ఎప్పుడు చేయకూడదు.తలలో బ్రహ్మ దేవుడు ఉంటాడు కనుక ఎంగిలి చేయి బ్రహ్మను తాకరాదు.
తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అడ్డుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు
.