వైరల్: బుల్లెట్ బండి పై పూజలు అందుకుంటున్న అమ్మవారు.. ఎక్కడో తెలుసా..?!

భారతదేశం అంటేనే సంప్రదాయాలు, కట్టుబాట్లకు నిలయం.దేశంలో ఎన్నో సంప్రదాయాలు, పద్దతులు ఉన్నాయి.

 Muthumari Amman Temple Goddess Puja On Bullet Bike Do You Know Somewhere..?! ,-TeluguStop.com

వాటిని ఇప్పటికీ జనాలు పాటిస్తూ తమ సంప్రదాయాలను కొత్తతరం వారికి చెబుతూ ఉంటారు.ఇండియాలో ఎన్నో పండుగలు ఉంటాయి.

మతాలు, కులాలు, తెగలను బట్టి వివిధ పండుగులు ఉంటాయి.కొంతమంది భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు.

రాష్ట్రాలను బట్టి పండుగులు మారుతూ ఉంటాయి.ఏ దేశంలోనే లేనంతంగా భారతదేశంలో పండుగలను ఘనంగా జరుపుతూ ఉంటారు.

Telugu Ammavaru, Bullet Bike, Goddess, Latest, Muthumariamman, Tamil Nadu-Genera

సీజన్‌కు తగ్గట్లు పండుగలు ఉంటాయి.ప్రస్తుతం వర్షాకాలంలో జరుపుకునే పండుగ ఒకటి ఉంది.అదే పెరుక్కు.మాన్‌సూన్ పండుగ అని పిలిచే దీనిని తమిళులు జరుపుకుంటారు.తమిళ నెలలోని( Tamil Nadu ) 18వ రోజున ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈన క్యాలెండర్ ప్రకారం జులై 16న ఈ పండుగ ప్రారంభమై ఆగస్టు 16న ముగియనుంది.

తమిళనాడులోని తేని జిల్లాలోని సమర్థ్మపురంలో ఉన్న శ్రీ ముత్తుమారి అమ్మన్ ఆలయం( Muthumari Amman Temple )లో ఈ పండుగను ఘనంగా జరుపుతారు.ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని ఒక స్టేజ్‌పై బుల్లెట్ బైక్‌పై ఉంచుతారు.

Telugu Ammavaru, Bullet Bike, Goddess, Latest, Muthumariamman, Tamil Nadu-Genera

అమ్మవారిని పూల దండలు, బంగారంతో అలకరిస్తారు.కరెన్సీ నోట్లను పూలపై ఉంచుతారు.బుల్లెట్ బైక్‌పై దర్శనం ఇచ్చే ఈ అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది.త్రిశూలం, పుర్రె, సర్పం, డమరు పట్టుకుని ఉంటుంది.పెళ్లి చేసుకోవాలనుకునే భక్తులు మంగళసూత్రం సమర్పించే బదులు ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర బంగారు ముత్యాన్ని సమర్పిస్తారు.

ముత్తుమారి అమ్మన్ అమ్మవారిని సుబ్రహ్మణ్య భగవానుడి దైవిక భార్యగా భక్తులు భావిస్తారు.వర్షాకాలంలో ఇక్కడ జరుపుకునే పండుగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తారు.

దీంతో అక్కడ ఈ పండుగ బాగా పాపులర్ అయింది.అమ్మవారిని బుల్లెట్ బైక్( Bullet bike ) పై ఉంచడం మరింత ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube