బతుకమ్మకు తోడుగా గౌరమ్మను ఎందుకు ఉంచుతారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న ప్రజలందరూ చిన్న పండుగను కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అలాగే ఏ పండుగలో అయినా ఆచారాలను, సాంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.

 Do You Know Why Gauramma Is Kept Along With Bathukamma , Traditions ,   Bathukam-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మ( Bathukamma ) అంటే అమ్మ వారిని పూల రూపంలో ఆవాహన చేసి ఆరాధించే పండుగ అని పండితులు( Scholars ) చెబుతున్నారు.మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు ఊరు వాడ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

అలాగే బతుకమ్మ పండుగ( Bathukamma festival ) మొదలైనప్పటి నుంచి వర్షాకాలం ముగిసిపోయి చలికాలం మొదలవుతుంది.

Telugu Bhakti, Devotional, Gouramma, Scholars-Telugu Bhakthi

ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో రకరకాల పూలు విరిసి భూమాత ఆహ్లాదం పొందుతుంది.చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః- సంపంగి, అశోక, పున్నగా, చెంగల్వా వంటి పూల పరిమళాలతో ప్రకాశించే శిరోజా సంపద కలిగిన ఓ జగన్మాత అంటూ అమ్మ వారిని నవ రాత్రులు భక్తులు ఆరాధిస్తూ ఉంటారు.ఇందులో భాగంగా అమ్మ వారిని పూలతో బతుకమ్మగా కొలువు తీర్చి ఆట పాటలతో కొలుస్తారు.

అలాగే సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మను పేరుస్తారు.ఇంకా చెప్పాలంటే ఆ తల్లిని ఆడ బిడ్డలకు ప్రతిరూపంగా భావిస్తారు.

Telugu Bhakti, Devotional, Gouramma, Scholars-Telugu Bhakthi

ఇంకా చెప్పాలంటే ఈ పండుగ రోజుకి వీధిగా ఆడపిల్లలను పుట్టింటికి ఆహ్వానిస్తారు.అలాగే పెద్ద బతుకమ్మకు జంటగా రెండో బతుకమ్మను గౌరీ దేవికి ప్రతిరూపంగా పెరుస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే పసుపుతో గౌరమ్మను చేసి అందులో ఉంచి పూలతో అలంకరిస్తారు.బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసే సందర్భంలో పసుపు గౌరమ్మను వెనక్కి తీసుకొని పుల బతుకమ్మను నిటిలో వదులుతారు.

ఆ పసుపు గౌరమ్మను( Gouramma ) ఆడబిడ్డలు కుంకుమకు అద్దుకోని అమ్మవారి ప్రసాదంగా అలంకరించుకుంటారు.అందుకే గౌరీ దేవికి ప్రతిరూపంగా చిన్న బతుకమ్మను పేర్చే సంప్రదాయం వచ్చిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube