ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.38
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ1.30 ల2.20
దుర్ముహూర్తం: సా5.02 ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.వృధా ఖర్చు విషయాల్లో ఆలోచించి వ్యవహరించడం మంచిది.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.
వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి.చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాల్లో ఆర్థిక లబ్ది కలుగుతుంది.
మిథునం:
ఈరోజు మీ ఆరోగ్యం విషయం గురించి జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి.ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.
ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి.ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు.నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు బాట పడతారు.
సింహం:
ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
కన్య:
ఈరోజు వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.నూతన పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు.రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకలంలో అందుతాయి.
తులా:
ఈరోజు వ్యాపార వ్యవహారాల్లో అవరోధాలు తొలగుతాయి.కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి.తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.
వృశ్చికం:
ఈరోజు మీరు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంకా బయట సమస్యలు అధికమవుతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సరిస్తారు.వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.
ధనస్సు:
ఈరోజు మీకు నూతన గృహ వాహన యోగం ఉన్నది.నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు.
వృత్తి వ్యాపారాలు పెట్టుబడుల విషయాల్లో అంచనాలు అందుకుంటారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు గృహమున్న వినోదాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత గా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు గృహమున్న వినోదాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత గా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు.ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు.అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార ఉద్యోగాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.
LATEST NEWS - TELUGU