చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇంట్లో ఫొటోలు పెట్టుకుంటారు.నిత్యం వారిని స్మరించుకోవడం వల్ల వారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు.
అందుకోసం వారి ఫొటోకు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తారు.ఇక చాలా ఇంటి నిర్మాణానికి వాస్తు ఫాలో అవుతారు.
అయితే చనిపోయిన వారి ఫొటోలను పెట్టుకునే సమయంలో కూడా వాస్తు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.లేదంటే ఇంట్లో సుఖ శాంతులు, సంతోషం హరించుకుపోతాయని చెబుతున్నారు.
కొంతమంది చనిపోయిన వారి ఫొటోలను బెడ్ రూమ్స్ లో, డైనింగ్ హాల్ లో, మరికొందరు దేవుడి మందిరంలో పెడుతుంటారు.ఇలా అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు.
చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడ పెట్టాలి?
చనిపోయిన వారి ఫొటోలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయట.అంతేకాదు.
ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు పండితులు.

అందుకే చనిపోయిన వారి ఫొటోలను బెడ్ రూమ్ లో అస్సలు పెట్టకూడదట.ఇక దేవుడి మందిరంలో పెట్టిన కూడా సమస్యలు వస్తాయట.
చనిపోయిన వారి ఫొటోలను ఇంట్లో దక్షిణం వైపున పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
దక్షిణ దిక్కు యముడి స్థానం అంట.దక్షిణం వైపు గోడకు పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు దరిచేరవని అంటున్నారు.చనిపోయిన వారి ఫొటోను దక్షిణం వైపు గోడుకు పెడితే.దానికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫొటో పెడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు.