కాంగ్రెస్ ( Congress )అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.ఈ క్రమంలోనే పెద్దల సభ నుంచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని యోచిస్తున్నారు.
ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ( Sonia Gandhi ) ఇవాళ నామినేషన్ వేయనున్నారు.జైపూర్ లో ఆమె నామినేషన్ వేస్తారని తెలుస్తోంది.
కాగా రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు.
ఆయన పదవీకాలం ఈ ఏప్రిల్ తో ముగియనున్నది.అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే( Rahul Gandhi , Mallikarjuna Kharge ) పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉత్తరాది నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
రాయ్ బరేలీ నుంచి వరుసగా నాలుగు సార్లు సోనియా విజయం సాధించగా.రానున్న ఎన్నికల్లో రాయ్ బరేలీలో ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నారని సమాచారం.