ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి కూడా క్రియేట్ చేసి పెట్టాయి.
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలు చాలానే ఉన్నప్పటికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ అయితే ఉండేది.ఇక ఇప్పుడు అదే సక్సెస్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు.అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర( Vishwambhara ) సినిమాతో సూపర్ హిట్ ను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన ‘అనిల్ రావిపూడి’( Anil Ravipudi ) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇక ఈ మూడు సినిమాల తర్వాత కూడా ఆయన బాబి( Bobby ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

గత కొద్దిరోజుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వాల్తేర్ వీరయ్య సినిమా వచ్చింది.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించినప్పటికి ఈ కాంబో ను మరోసారి రిపీట్ అవ్వాలనే ఉద్దేశ్యంలో చిరంజీవి బాబి తో మరోసారి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.రీసెంట్ గా బాబి బాలయ్య బాబుతో ‘డాకు మహారాజ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు…
.