ముఖ్యంగా చెప్పాలంటే నాన్ వెజ్ తినే వాళ్లకు ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి.వీరు నాన్ వెజ్ తినాలనుకుంటే మటన్, చిరాకుగా ఉంటే చికెన్, ఫ్రెష్ గా ఉంటే ఫిష్, ఇలా ఎప్పుడూ ఏది కావాలంటే అది తింటూ ఉంటారు.
పాపం వేజ్ తినే వాళ్లకు అన్ని ఆప్షన్ లు ఉండవు.వాళ్ళు ఏదైనా స్పైసీగా తినాలంటే వేజ్ బిర్యానీ, పన్నీర్ బట్టర్, మసాలా లాంటివి చేసుకుంటారు.
పన్నీర్ వారి స్పైసీ కోరికను తీరుస్తుంది.పన్నీర్( Paneer ) తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అకాల వృద్ధాప్యాన్ని తగ్గించడంలో పన్నీర్ ఎంతో ఎంతో బాగా సహాయపడుతుంది.పన్నీర్ అనేది పాలతో తయారు చేయబడిన ఉత్పత్తి.
ఇది వివిధ రుచులు, రూపాల్లో తయారు చేస్తారు.

పన్నీర్ క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాలకు మంచి మూలం.అయితే ఇది మెదడు యొక్క వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయమం, మానసిక ఉద్దీపన, తగినంత నిద్ర వంటి అనేక అంశాలు కలయిక.
పన్నీరు ఒక పోషకమైన ఆహారం కాబట్టి మెదుడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దీనిని తీసుకోవచ్చు.మరి దీనీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీర్ లో క్యాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ మరియు జింక్ వంటి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా( Healthy muscles ) ఉంచడానికి ఈ పోషకాలు ఎంతో అవసరం.

ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నప్పటికీ పన్నీర్ యొక్క మితమైన వినియోగం గుండె సమస్యల ప్రమాదాన్ని ( Heart problems )కూడా తగ్గిస్తుంది.కొన్ని రకాల పన్నీర్ లో ( Paneer )ప్రోబయోటిక్స్ అని పిలువబడే లైవ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది.ప్రోబయోటిక్స్ గట్ మైక్రోఫ్లోరాను సమతుల్యం చేయడం జీర్ణ క్రియను మెరుగుపరచడం రోగనిరోధక శక్తిని( Immunity ) పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది.అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పన్నీర్ లోని విటమిన్ ఏ ఎంతో అవసరం.
ఇది కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే మొటిమలను నివారించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే దంతక్షయాన్ని నివారించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా పన్నీర్ లో క్యాల్షియం, ఫాస్ఫరస్ దంతాలను బలోపేతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.